Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి
నవతెలంగాణ-కోదాడరూరల్
కుల,మతాంతర ఆదర్శ వివాహాలతోనే కులరహిత సమాజం సాధ్యమవుతుందని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు.మంగళవారం పట్టణంలోని నయానగర్లో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆ సంఘం ఆధ్వర్యంలో ఆదర్శ వివాహం చేసుకున్న ప్రముఖ న్యాయవాది ఉయ్యాల నర్సయ్య-సుజాత,జర్నలిస్టు కోట రాంబాబు-లక్ష్మీ,కందుల పాపయ్య-వెంకటరావమ్మ దంపతులను సన్మానించారు.ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ అంతరాలు లేని సమాజ నిర్మాణం కోసం,ప్రేమ వివాహాలను ప్రోత్సహించాలన్నారు. కుల మతాంతర వివాహాలు చేసుకున్న జంటలను ప్రభుత్వాన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు.కులాంతర వివాహం చేసుకున్న జంటలకు రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు.ఆదర్శ వివాహాలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం పారితోషికాన్ని పెంచి సమసమాజ స్థాపనకు పాటుపడాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి జంగపల్లి సాయి, మొలుగూరి నాగరాజు పాల్గొన్నారు.