Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణంలో జంక్షన్ పనులు త్వరలో పూర్తి
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
మున్సిపల్ పరిధిలో చేపట్టిన అన్ని పనులను మే మాసంతానికి పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో పట్టణంలోని మున్సిపల్ పరిధిలో చేపట్టిన పలు అభివద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, వైస్‌చైర్మెన్ వైటీడీఏ రిటైర్డ్ ఐఏఎస్ కిషన్‌రావుతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ సుందరీకరణలో భాగంగా ఎక్కడ కూడా పనులలో అధికారులు రాజీపడవద్దని అధికారులను ఆదేశించారు. పట్టణాల సుందరీకరణలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.సద్దుల చెరువు వద్ద గల 5 ఎకరాల అన్ని మౌలిక వసతులతో ఫుడ్కోర్ట్, బోటింగ్, ప్రజలకు వినోదాన్ని పంచే విధంగా సుందరీకరణ పనులు చేపట్టనున్నట్టు తెెలిపారు. అట్టి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు వారంలో సిద్ధం చేసి పంపాలని ఆదేశించారు. ఇప్పటికే పట్టణంలో పీఎస్ఆర్ సెంటర్, రాఘవ ప్లాజా వద్ద జంక్షన్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు.వారంలో పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు.అలాగే ఎన్టీఆర్ పార్క్ వద్ద గల జంక్షన్ పనులు త్వరగా పూర్తగి చేయాలని మంత్రి ఆదేశించారు. పుల్లారెడ్డి, దురాజు పల్లి చెరువులను ట్యాంక్బ్యాండ్లుగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం గూగుల్ మ్యాప్ ద్వారా సద్దుల చెరువును పరిశీలించి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు పాటిల్ హేమంత కేశవ్, ఎస్.మోహన్‌రావు, డీఆర్ఓ రాజేంద్రకుమార్, మున్సిపల్ కమిషనర్ రామనుజులరెడ్డి, ఈఈ నీటిపారుదల జగ్గునాయక్, తహసీల్దార్ వెంకన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.