Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
సోమప్ప జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా శాఖల అధికారులను తహసీల్దార్ సరిత ఆదేశించారు.నేరేడుచర్ల మండలపరిధిలోని సోమారం బూర్గులతండా గ్రామా పంచాయతీ పరిధిలో ఉన్న సోమప్పజాతర ఈ నెల 17నుండి 20వరకు ఉన్న సందర్భంగా తహసీల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయం వద్ద తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ తదితర వసతులు కల్పించాలన్నారు. ట్రాఫిక్సమస్యను పరిష్కరించాలన్నారు. భారీ వాహనాలను ఆలయం దగ్గరకు అనుమతించొద్దన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై నవీన్‌కుమార్, ఆలయ చైర్మెన్ రాచకొండ శ్రీనివాస్, ఎంపీడీఓ శంకరయ్య, విద్యుత్ ఏఈ శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ నాగార్జునరెడ్డి, విజయకుమారి, డిప్యూటీ తహసీల్దార్ స్రవంతి,ఆ లయ ఇన్స్పెక్టర్ రమేశ్, ఆర్అండ్బీ ఏఈ శివకుమార్, ఎన్నెస్పీ ఏఈ, పీహెచ్సీ వైద్యులు, సర్పంచ్ రోజా నాగునాయక్ పాల్గొన్నారు.