Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి ధైర్యం చెప్పే విషయమే ప్రజా ప్రస్థాన పాదయాత్ర అని వైఎస్సార్టీపీ నియోజకవర్గ ఇన్చార్జి గ్యారా నరేష్ అన్నారు. మంగళవారం జనగామ జిల్లా కేంద్రంలో వైఎస్సార్ అధినేత్రి షర్మిలను కలిసి ప్రజా ప్రస్థానం పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మోట కొండూరు మండల అధ్యక్షుడు దండు మహేందర్ ,ఆలేరు మండల అధ్యక్షుడు నరసింహ చారి, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు తోటకూరి రవి, నాయకులు జెనీమియా .సిద్దేశ్వర్ ,సందీప్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.