Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట అఖిలపక్షం ధర్నా
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
యాదగిరి గుట్ట పట్టణం లో ఉన్న బస్టాండ్ ను యదాతథంగా కొనసాగించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్ చేశారు. మంగళవారం అఖిలపక్ష రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి ప్రదర్శనగా వెళ్లి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతు పట్టణంలోని బస్టాండు పట్టణ మండలంలోని గ్రామాల ప్రజలకు యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉందన్నారు. 50 ఏండ్ల క్రితం అన్ని రకాలుగా ఆలోచించి బస్టాండ్ డిపో ఇక్కడ నిర్మాణం చేపట్టారని,ఆనాడు ప్రభుత్వ భూమితో పాటు కొంతమంది రైతులు నుండి భూములను కొనుగోలు చేసి బస్టాండ్ డిపోను ఏర్పాటు చేశారని తెలిపారు.. బస్టాండ్ పట్టణంలోని నడి మధ్యన ప్రజలందరి ప్రయాణానికి సౌకర్యంగా ఉందన్నారు. బస్టాండులో బస్సు దిగగానే కాలినడకన, మెట్ల దారిన కొండపైకి వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని వివరించారు.బస్టాండ్ ఆధారంగా వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నారని బస్టాండ్ ఇక్కడ నుంచి తరలించడం వలన,బస్సులు ఆపకపోవడం వలన ప్రజలు ఉపాధి కోల్పోయి నష్టపోతుంటే భక్తులు సరైన సౌకర్య వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆర్టీసీ బస్టాండ్ యధావిధిగా ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో వైస్ చైర్మెన్ కాటబత్తిని ఆంజనేయులు, ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు మంద శంకర్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, మున్సిపల్ కౌన్సిలర్ ముకర్ల మల్లేశం, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య,బిజెపి నాయకులు బెలిదే అశోక్, బబ్బూరి శ్రీధర్, బందారపు బిక్షపతి, పెరబోయిన మహేందర్, గుండ్లపల్లి శ్రీరామ్, బట్టు సతీష్ రాజ్, బండి జంగమ్మ, బండి అనిల్,బొజ్జ సాంబేష్, గుండు నరసింహ, గుండ్ల నరేష్, జీ దేవేందర్, ఏస్ కే మన్సూర్ పాషా,కే శేఖర్,పి బంగారి, బి.శ్రీనివాస్, కృష్ణ, కర్ణాకర్, వెంకటేష్,ముత్యాలు ఉమాపతి, లక్ష్మీనారాయణ, రాజు, నరసింహ, మధు తదితరులు పాల్గొన్నారు.