Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూదాన్‌పోచంపల్లి
పోచంపల్లి మండల వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ వెంటనే ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఫిలాయిపల్లి గ్రామంలో ఆ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి తిరిగి ప్రజా విరాళాలను సేకరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఆయా గ్రామాలలోని చాలామంది నిరుపేదలు ఉన్న వారి కనీసం రేషన్ బియ్యం లేక ఎంతోమంది పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని పరిస్థితి అన్నారు. అర్హులైన వారందరికీ వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు కోట రామచంద్ర రెడ్డి శాఖ కార్యదర్శి మార్త సత్యనారాయణ మండల కమిటీ సభ్యులు మంచాల మధు పాల్గొన్నారు.