Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీఆర్డీ జిల్లా కార్యదర్శి వనం ఉపేందర్
నవతెలంగాణ- రామన్నపేట
ఇంటి స్థలంలో వికలాంగులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ రూ.5లక్షల ఆర్థిక సహాయం అందించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం మండల కేంద్రంలో మండల కమిటీ సమావేశం నాగు నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ స్థలం లేని వాళ్లకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించాలని కోరారు. ప్రతి వికలాంగునికీి అంతోదయ రేషన్ కార్డు 35 కిలో బియ్యం ఇవ్వాలని, ప్రతి వికలాంగునికి వికలాంగులు పెన్షన్ 10వేల రూపాయలకు పెంచాలని, ప్రతి వికలాంగునికి వికలాంగుల బంధు 12 లక్షల 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన మండల కంటిని అనుకున్నారు. గౌరవ అధ్యక్షులు పిండిపూలు వెంకన్న, అధ్యక్షులు నాగు నరసింహ, ప్రధాన కార్యదర్శి గిరికల లింగస్వామి, ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీను, పిట్ట శ్రీనివాస్ రెడ్డి, నోముల రవి వర్మ, క్రాంతి కుమార్, సహాయ కార్యదర్శులు తాటిపాముల జంగయ్య, వనం ఆంజనేయులు, వనం విజయలక్ష్మి, భాష మల్ల యాదయ్య, కోశాధికారి కుందూరు వెంకటేశం లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీపాల అంజయ్య చారి, పలసం పరశురాం, కన్నబోయిన మంగమ్మ, కన్నబోయిన సత్యనారాయణ, అంజయ్య, కోటయ్య, ధనలక్ష్మి, బిక్షం పాల్గొన్నారు.