Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కోసం మంగళవారం డీవైఎఫ్ఐ మండల, మున్సిపల్ కమిటీల ఆధ్వర్యంలో సమగ్ర సర్వే నిర్వహించారు. ఆసుపత్రిలోని వైద్యులు, రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సర్వేలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పల్లె మధుకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వాసుపత్రి పూర్తిగా సమస్యల నిలయంగా ఉందన్నారు. ఆసుపత్రిలో 16 మంది డాక్టర్లు అవసరం ఉండగా ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఆసుపత్రిలో వైద్యుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మెరుగైన వైద్యం అందకపోవడం వల్ల ప్రయివేట్ వైద్యం తీసుకోవాల్సి వస్తుందన్నారు. పరీక్షలకు సంబంధించి ల్యాబ్ కొరత, పూర్తిస్థాయిలో పరీక్షలు అందుబాటులో లేవన్నారు. రోజువారిగా 200 మంది ఓపీతో నడుస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని తక్షణమే 100 పడకల ఏరియా ఆసుపత్రిగా ఏర్పాటుచేయాలని డిమాండ్చేశారు. ఈ సర్వేలో ఆ సంఘం మున్సిపాలిటీ, మండల అధ్యక్షులు దేప రాజు, సామిడి నాగరాజురెడ్డి, సుర్కంటి శంకర్రెడ్డి, బోదాసు వెంకటేశ్, ఎస్కె.మదార్, చింతకింది సుందర్ ఉన్నారు.