Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం
నవతెలంగాణ -వలిగొండరూరల్
గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని,కార్మికుల సమస్యలు పరిష్కారం కోరుతూ సీఐటీయూు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ తో పాటు ఆరుగురు చేపట్టిన రాష్ట్ర పాదయాత్ర ఈనెల 15 నుండి 21 వరకు జిల్లాలో సాగుతున్న పాదయాత్రను జయప్రదం చేయాలని సీఐటీయూజిల్లా అద్యక్షులు కల్లూరి మల్లేశం ,గ్రామ పంచాయతీ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పైళ్ళ గణపతి రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. బుధవారం పాదయాత్ర పోస్టర్ను పులిగిల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులు నిత్యం కష్ఠపడి పనిచేస్తున్న ప్రభుత్వం కనీస వేతనాలు ఇవ్వడం లేదన్నారు. పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. పెరుగుతున్న ధరలకనుగుణంగా వేతనాలు పెంచాలని ,కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను రద్దుచేయాలని, పిఎఫ్ ,ఈఎస్ ఐ లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సాగుతున్న పాదయాత్ర లో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈనెల 19న జిల్లా కేంద్రంలో బహిరంగ సభ జరుగుతుందని పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు వాకిటి వెంకట్ రెడ్డి, దొడ్డి బిక్షపతి, మారబోయిన నర్సింహ, సాలయ్య, జగతయ్య, రామలింగం,ఎల్లయ్య,జంగమ్మ,సంతోష,వాణి తదితరులు పాల్గొన్నారు.