Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా
నవతెలంగాణ-నల్లగొండకలెక్టరేట్
జిల్లాలోని గ్రామ పంచాయతీ లలో ఆస్తి పన్ను నూరు శాతం వసూలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో పంచాయతీ రాజ్ ఈ ఈ లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీవోల తో సమావేశం నిర్వహించి వివిధ అభివృద్ధి పనుల పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ పంచాయతీలలో ఆస్తి పన్ను వసూలు,తెలంగాణ క్రీడా ప్రాం గణాలు ఏర్పాటు,సి.సి.రోడ్లు,జి.పి.భవనాల నిర్మాణం,నర్సరీలు ,పల్లె ప్రకృతి వనాలు,బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు,ఉపాధి హామీ కూలీలకు పనులు కల్పించుట తదితర అంశాల పై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పన్ను వసూలు చేసి అందులో 8 శాతం లైబ్రరీ సెస్ కింద చెల్లించాలని అన్నారు.తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు లో వారం వారం ప్రగతి కనిపించాలని,ప్రతి గ్రామంలో,ఆవాసం లో ఏర్పాటుకు స్థలం గుర్తించిన చోట పనులు మొదలు పెట్టాలని,స్థలం గుర్తించని చోట తహశీల్దార్ లతో ఎంపీడీవోలు సమన్వయం చేసుకుని స్థలం గుర్తింపు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ ల భవనాలు నిర్మాణం సమీక్షించారు.జిల్లాలో నల్గొండ,మిర్యాలగూడ పంచాయతీ రాజ్ డివిజన్ లలో మొత్తం 218 భవనాలు 43 కోట్లా 60 లక్షల రూ.ల అంచనాతో మంజూరు చేయగా 17 భవనాలు నిర్మాణ పనులు పురోగతి లో ఉన్నాయని,నల్గొండ డివిజన్ లో 11 కోట్లా 20 లక్షల వ్యయం తో 56 భవనాలు మంజూరు చేయగా 14 భవనాల పనులు గ్రౌండింగ్ చేయగా, మిర్యాలగూడ డివిజన్ పరిధిలో 32 కోట్లా40 లక్షల వ్యయం తో 162 భవనాలు మంజూరు చేయగా మూడు గ్రౌండింగ్ చేసినట్లు అధికారులు వివరించగా పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. సీసీ రోడ్లు జిల్లాలో 123 కోట్ల 14 లక్షల అంచనా వ్యయంతో 731 జీపీలలో 1198 పనులు మంజూరు చేయగా 293 గ్రౌండింగ్ చేసి 48 పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రతి రోజు 50 మంది కూలీలకు పనులు కల్పించాలని,ఆర్థిక సంవత్సరం ముగింపు రెండు నెలల్లో ఉన్నందున లక్ష్యం పూర్తి చేయాలని ఆమె సూచించారు. మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమం కింద చేపట్టిన పనులను కూడా ఎంఈఓ లు, వివిధ శాఖల ఏఈ.లతో సమీక్షించారు. ఈ సమావేశం లో జిల్లా విద్యా శాఖ అధికారి బిక్ష పతి, జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, డిపిఓ విష్ణు వర్ధన్, డీఆర్డీఓ కాళింది ని తదితరులు పాల్గొన్నారు.