Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి
నవ తెలంగాణ-నార్కట్ పల్లి
ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని ఎంజీ యూనివర్సిటీ.ఉప కులపతి ఆచార్య గోపాల్ రెడ్డి. పేర్కొన్నారు. మంగళవారం .మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో, యశోద హాస్పిటల్ మలక్ పేట్ హైదరాబాదు వారి సహకారంతో తలపెట్టిన మెగా హెల్త్ క్యాంపును ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి, నియమాలు పాటిస్తూ క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించడం సాధ్యమవుతుందని అన్నారు. ఖరీదైన ఈ సి జి, 2డి ఎక్ మో వంటి పరీక్షలు సైతం ఉచితంగా అందించినటువంటి యశోద హాస్పిటల్స్ వారిని అభినందించారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ లో విద్యార్థిని విద్యార్థులకు అధ్యాపకులకు, ఇతర సిబ్బందికి బిపి, షుగర్ , ఈ సి జి, 2 డి ఎక్ మో పరీక్షలు నిర్వహించారు. ఈ క్యాంపు ద్వారా 200 మంది విద్యార్థులు సిబ్బందికి పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య తుమ్మ కృష్ణారావు, ఆచార్య అల్వాల రవి, ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ మద్దిలేటి, డాక్టర్ ప్రేమ్ సాగర్, సుధాకర్, డాక్టర్ జి మశ్చీందర్, మారేష్, నాగరాజు, రామచంద్రుడు, శేఖర్, స్వప్న, హరి, యశోద హాస్పిటల్ ప్రతినిధులు డాక్టర్ లికిషా, డాక్టర్ ఆన్సోలెమో, డాక్టర్ మోహన్ రెడ్డి డాక్టర్ సాయి తేజ, ఉమాదేవి, అవినాష్, తదితరులు పాల్గొన్నారు.