Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నాంపల్లి
యాసంగిలో రైతులు సాగు చేసిన పంటల పరిశీలనలో భాగంగా మండలంలోని బ్రాహ్మణగౌరారం రెవెన్యూ పరిధిలో పంటపొలాలను మంగళవారం మునుగోడు వ్యవసాయ సహాయ సంచాలకులు డి.ఎల్లయ్య పరిశీలించారు.వరి ,ఇతర పంటలను సర్వే నెంబర్ల వారీగా పరిశీలించారు.యాసంగిలో రైతులు సాగు చేసి పంటల వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులకు తెలియజేసి పంట వివరాలను నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు.పంటలో సూక్ష్మ పోషకలోపాలు కనిపిస్తే ఫార్ములా-4 ఏ-2 గ్రాములు/1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి సాయికుమార్, రైతులు రాజయ్య, ఆరోగ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.