Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నలగొండ
ప్రస్తుత సమాజంలో యువతను చెడుదారి పట్టించడం కోసం మతోన్మాద భావాజాలం ముందుకు వస్తుందని, యువత మతోన్మాద భావాజాలానికి ఆకర్షితులై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ప్రముఖ విద్యావేత్త బండారు రమేష్ పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని స్టే ఇన్ హోటల్లో డీవైఎఫ్ఐ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో మొదటిరోజు ముఖ్య అతిథి హాజరై మాట్లాడుతూ మాట్లాడుతూ మతోన్మాద భావజాలం రోజురోజుకు పెరిగిపోతూ యువత మెదళ్లను మతోన్మాదం వైపు మళ్లిస్తూ భారతదేశ సంస్కృతిని సాంప్రదాయాలను వక్రీకరించే పద్ధతిలో చరిత్రను తప్పుదోవ పట్టిస్తూ యువత మెదలలోకి మతోన్మాదాన్ని ఎక్కించాలని కుట్ర జరుగుతుందని,దీనిని యువత పసిగట్టి మతోన్మాద భావజాలాన్ని తిప్పి కొట్టాలని వారు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ విధానాలను దేశం మీద ప్రయోగించి దేశ లౌకిక విధానాన్ని దేశ సమైక్యతను దెబ్బతీయాలని కుట్ర ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కులాల పేరుతో మతాల పేరుతో మనుషుల మధ్య ఐక్యతను దెబ్బ తీసే విధంగా బీజేపీి ప్రభుత్వ పాలన విధానం కొనసాగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ దేశ జీడీపీని పెంచుతుంది అని అనడం సిగ్గుచేటన్నారు.విద్య ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక అనేక మంది యువత ఎదురుచూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ మల్లం మహేష్ ఎస్ కె బషీర్, శివవర్మ, గడ్డం వెంకటేష్, ఎండి జావిద్,బోయిళ్ళ నవీన్, జగన్, రోషిని ఖాన్, కిరణ్, జిల్లా కార్యదర్శులు ప్రవీణ్, నల్గొండ జిల్లా నాయకులు గుండాల నరేష్, కోట్ల అశోక్ రడ్డి ,లాది కార్తీక్, కర్లపూడి రాము, ఆమనగంటి వేణు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆకారపు నరేష్, కంభంపాటి శంకర్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.