Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
అసెంబ్లీలో ముఖ్యమంత్రి,విద్యుత్ శాఖ మంత్రి నిరంతర ఉచిత కరెంట్ ఇస్తున్నామని మాటల కోతలు చెబుతున్నా గ్రామాల్లో అప్రకటిత కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయని తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ విమర్శించారు.రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయరంగానికి ఇస్తున్న విద్యుత్‌లో కొద్దిరోజులుగా కొనసాగుతున్న విద్యుత్ కోతలను నివారించాలని కోరుతూ బుధవారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎస్ఈకి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు మాండ్ర మల్లయ్య యాదవ్, యువజన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారబోయిన కిరణ్‌కుమార్, లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ కుంచం చంద్రకాంత్, విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగారి వినరుగౌడ్, తెలంగాణ జన సమితి పట్టణ అధ్యక్షుడు బంధన్ నాయక్, ఎస్టీ సెల్ పట్టణ కన్వీనర్ సతీష్‌నాయక్, మైనార్టీ నాయకులు ఖలీల్, నాయకులు సుమన్, కృష్ణ, అశోక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.