Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
పట్టణంలోని నల్లచెరువు, చౌదరి చెరువు కింద ఉన్న స్థలాలు, తూములను కొందరు కబ్జాదారులు ఆక్రమించుకొని కడీలు వేసి ఫ్లాట్లుగా మార్చుకుంటూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, వాటిని మున్సిపాలిటీ వారు అడ్డుకోవాలని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు సారగండ్ల కోటి కోరారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ పి.రామానుజులరెడ్డికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు.నల్లచెరువు కింద ఉన్న నల్లచెరువు వాగు భీమవరం రోడ్డు వాగు పూడుకపోయి చెరువులోని నీరు రోడ్డు మీదకు వచ్చి ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్నారు. వెంటనే వాగును పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా చౌదరిచెరువు అలుగు దిగువ భాగం మొత్తం ఆక్రమించి ప్లాట్లు చేసి అక్రమకట్టడాలు నిర్మిస్తున్నారని వెంటనే వాటిని ఆపాలని జాతీయ రహదారి వెనుక భాగాన ఉన్న చెరువు భూములను సైతం ఆక్రమించారన్నారు.మానసనగర్లోని హైవే బ్రిడ్జి పక్కన చెరువు భూమిని కబ్జా చేసి అటువైపు ఇటువైపు మట్టిని పోసి భూమిని ఆక్రమించుకుంటున్నారని తెలిపారు.ఆక్రమించిన భూమిలో అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయన్నారు. సరస్వతి పాఠశాల పక్కన ఒకటవతూము పంటకాలువ దగ్గర ఆక్రమించారని, తిరిగి ఆ పంటకాలువలను పునరుద్ధరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నల్లమేకల వెంకన్న, ప్రధానకార్యదర్శి సందనబోయిననాగరాజు, కోశాధికారి ఇండ్లసురేష్, డైరెక్టర్లు కోల నిరంజన్, మోర జానకిరాములు, నల్లమేకల అంజయ్య, ఇండ్ల లక్ష్మమ్మ, మారిపెద్ది ముత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.