Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గరిడేపల్లి
మండల పరిధిలోని పరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలను జడ్పీ సీఈవో సురేష్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల గురించి పాఠశాల అభివృద్ధి గురించి స్థానిక ప్రధానోపాధ్యాయులు గుగులోతు సైదానాయక్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి ఒక్క మెటీరియల్స్ విద్యార్థులకు అందజేయాలని, మధ్యాహ్న భోజనం మెనూపకారం విద్యార్థులకు పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాతశ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో వనజ, స్థానిక సర్పంచ్ లక్ష్మీ, పీఏసీఎస్ చైర్మెన్ శంబిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీరాం, అంగన్వాడీ టీచర్ సురభి, సునీత, ఆయా లక్ష్మమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.