Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకీడు
మండల పరిధిలోని భవానిపురం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పరిసర గ్రామాల నుండి 350 మందికి పైగా ప్రజలు ఈ వైద్య సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ఈ శిబిరాన్ని సంస్థ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరాజు, జీఎం నాగమల్లేశ్వరరావులు వైద్యులతో కలిసి ప్రారంభించారు. మిర్యాలగూడకు చెందిన బాలాజీ హాస్పిటల్ వైద్య బృందం, ఉచిత వైద్య చికిత్సలు నిర్వహించి అవసరమైన వారికి మందులు సరఫరా చేశారు. సమీప గ్రామాలైన రావి పహాడ్, శూన్య పహాడ్, జాన పహాడ్, మహంకాళి గూడెం, చెరువు తండా, కల్ మేడ్ తండాల నుండి, వచ్చిన ప్రజలకు రవాణా సౌకర్యం, భోజన వసతిని యాజమాన్యం కల్పించింది. ఈ కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ సూర్యనారాయణ, వివిధ శాఖలకు చెందిన మస్తాన్, పీఎస్ రావు, జగన్, నరసింహరెడ్డి, రమణ, ప్రవీణ్‌కుమార్, శ్రీనాథ్, రమేష్ లతోపాటు వైద్యులు పీ. సునీత, శ్రీనివాస్, శశిధర్ రెడ్డి, గోపీనాథ్, సంతోష్, అక్షిత, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.