Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవా లాల్ మహారాజ్ అని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. బుధవారం పట్టణంలోని భవాని నగర్లో సంత్ సేవాలాల్ 284వ జయంతి వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. మహభోగ్ బండార్ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ సర్కారు గిరిజనుల ఆరాధ్యదైవమైన సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికారంగా నిర్వహిస్తోందన్నారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్ కుమార్, ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్రెడ్డి, ఎమ్మెస్ కళాశాల చైర్మన్ పందిరి నాగిరెడ్డి, గిరిజన నాయకులు ధరావత్ హాజీనాయక్, భట్టు శివాజీ నాయక్, భూక్యా హనుమా నాయక్, మలోతు సైదా నాయక్, దశరథ్ నాయక్, లచ్చిరామ్, నందు లాల్, శరన్, గుగులోతు శ్రీను, పద్మ, కోటియా, రాజు, రఘు,రాము, జగ్గూ భావసింగ్, ప్రతాప్, రాంప్రసాద్, పవన్ రాథోడ్, భూక్య వెంకన్న, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, సంఘం నాయకులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.