Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మనువాదుల కుట్రలను ప్రతిఘటించాలి
- కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి
నవతెలంగాణ-సూర్యాపేట
దేశంలో భారత రాజ్యాంగాన్ని మార్చివేసి మనుస్మృతి ని అమలు చేయాలనే ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే హైదరాబాదులో మనుస్మృతి పుస్తకాన్ని ఆవిష్కరించారని కెేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి విమర్శించారు.మనుస్మృతి పుస్తకావిష్కరణకు నిరసనగా కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం స్థానిక రైతుబజార్ వద్ద గల అంబేడ్కర్ విగ్రహం ముందు మనుస్మృతి ప్రతులను దహనం చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశంలో ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ పరిపాలన కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు.మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన నుండి భారత రాజ్యాంగాన్ని మార్చి వేయాలనే కుట్రలు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ దేశంలో అసమానతలు సృష్టించే మనస్మృతిని మళ్లీ ఆవిష్కరణ చేయడానికి చూస్తే ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగానే ఇలాంటి ఆవిష్కరణలు జరుగుతు న్నాయన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు సమానంగా బతకాలని సూచించిన అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడు కోవ లన్నారు. రాజ్యాంగరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు మను వాదుల కుట్రలను తిప్పికొట్టేం దుకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపుని చ్చారు. ఆర్ఎస్ఎస్ కనుసైగలతో హమారా ప్రసాద్ అనే దుర్మార్గుడు అంబేద్కర్ని అవమానపరుస్తూ వ్యాఖ్యానాలు చేశాడని పేర్కొన్నారు.హమారా ప్రసాద్ వ్యాఖ్యలను ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించాలని కోరారు.వెంటనే అతన్ని శిక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉదరు,రవి, నాగరాజు, నరేష్నాయక్, మరికంటి మహేష్, మల్లెల మధు,వినోద్, ముత్యాలు, మంద సతీష్,రెడపంగ రమేష్, శ్రీకాంత్,సందీప్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.