Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
వైకుంఠదామ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు.బుధవారం సద్దల చెరువు వద్ద నిర్మిస్తున్న ఆధునిక వైకుంఠదామ పనులను పరిశీలించి మాట్లాడారు.దీనిలో మొక్కలను పెంచి ప్రజలకు ఆహ్లాద వాతావరణం కల్పించాలని సూచించారు.వైకుంఠదామం యొక్క ఎంట్రన్స్ ప్లాజా సుందరంగా ఉండాలన్నారు.దీనిలో నిర్మిస్తున్న శివుని విగ్రహాన్ని అలాగే కోల్డ్‌స్టోరేజ్, టాయిలెట్స్, దింపుడుగల్లం, పూజ మండపం, అంతర్గత రోడ్లు, విద్యుత్ క్రిమిటోరియం పనులను పరిశీలించారు.పనులను వేగవంతం చేసి తొందరగా పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్ పి.రామానుజులరెడ్డిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పాటిల్ హేమంతకేశవ్, మున్సిపల్ డీఈ జీకే.దుర్గాప్రసాద్, ఏఈ సంపత్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.