Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజాస్వామ్య దేశమా?డిక్టేటర్ రాజ్యమా?
- మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు
నవతెలంగాణ-సూర్యాపేట
ప్రధాని మోడీ నియంతను పాలనకు 2024 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి తీరుతారని రాజ్యసభ మాజీ సభ్యులు వి.హనుమంతరావు అన్నారు.బుధవారం ఖమ్మం నుండి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం రాజకీయ నాయకులనే కాకుండా మీడియాను సైతం ఇబ్బంది పెడుతుందని విమర్శించారు. ప్రధాని మోడీ దుశ్చర్యలను ప్రజలకు తెలియజేస్తే మీడియాపై ఐటీ చేయడం దుర్మార్గమన్నారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలలో ప్రభుత్వాలను పడగొట్టడం లేదా అధికార పార్టీ నాయకులను కొనుగోలు చేయడం లాంటి రాజకీయాలు మాత్రమే చేస్తుందని ప్రజల సమస్యలను పరిష్కరించడం లేదన్నారు.కాంగ్రెస్ హయాంలో ఏనాడు స్వతంత్ర సంస్థలపై ఆంక్షలు విధించలేదన్నారు.మీడియాపై ఐటీ దాడులు ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.దేశంలో డిక్టేటర్ పాలన కొనసాగుతుందని మండిపడ్డారు.ప్రజల సొమ్మును కేంద్రప్రభుత్వం కార్పొరేట్శక్తులకు అప్పనంగా తాకట్టు పెడుతుందని ధ్వజమెత్తారు.ఐటీదాడుల పేరుతో మీడియాపై బీజేపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. బీబీసీపై దాడులను అన్ని మీడియా సంస్థలు వ్యతిరేకించాలని సూచించారు. ప్రతిపక్షాలను అవినీతి పేరుతో విచారణసంస్థలతో ఇబ్బంది పెట్టే బీజేపీ స్వపక్షంలో ఆ పార్టీ నాయకులు అవినీతి చేస్తే ఎలాంటి విచారణ ఉండదని పేర్కొన్నారు.వేల కోట్లు దోచుకుంటున్న అదానిపై ఎందుకు విచారణ చేపట్టడం లేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.లలిత్ మోడీ,విజరు మాల్యా నల్లధనాన్ని వెనక్కి ఎందుకు తీసుకురాలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.ఎన్నికల వేళ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు సరికాదన్నారు.కోమటిరెడ్డి వ్యాఖ్యలతో కింది స్థాయి కార్యకర్తలు డీమొరలైజ్ అవుతున్నారని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో వివాదాలు, తగాదాలకు దూరంగా ఉండి కలిసి పనిచేయాలని,పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు.ఈ సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు అంజద్అలీ, ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, అక్కెనపల్లి జానయ్య,నరేందర్నాయుడు, ఆలేటి మాణిక్యం, నాగులవాసు, గడ్డంవెంకన్న, కిరణ్ పాల్గొన్నారు.