Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోడ్డు భద్రత అందరి బాధ్యత
- ఎస్పీ రాజేంద్రప్రసాద్
నవతెలంగాణ-సూర్యాపేట
వాహనదారులు అన్ని అనుమతిపత్రాలు కలిగి, లైసెన్స్, ఇన్సూరెన్స్, బండికి నెంబర్‌ప్లేట్ కలిగి ఉండాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు.బుధవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన జిల్లా పోలీసు అధికారుల నెలవారీ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలతో మమేకమై, ప్రజలను భాగస్వామ్యులను చేసి స్నేహపూర్వక పోలీసింగ్ చేయాలని కోరారు.అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలన్నారు.గ్రామాల్లో, కాలనీల్లో, వ్యాపార సముదాయాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు కృషి చేయాలని, ప్రజలకు వ్యాపారులకు సీసీటీవీ కెమెరాల ఉపయోగం అవశ్యకతను అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇంటలిజెన్స్ బాగా సేకరించాలని ఏవైనా అవాంఛనీయ సంఘటనలు, అక్రమ వ్యాపారాలు, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చర్యలు పటిష్టం చేయాలన్నారు. వాహనాల తనిఖీల సమయంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు.అదేవిధంగా ప్రతిరోజూ జిల్లా అంతటా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దన్నారు. పోలీసింగ్ విది విధానాలపై స్టేషన్ నిర్వహణపై డీఎస్పీలు,సీఐలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుండాలని సిబ్బందికి అవసరమైన సలహాలు సూచనలు అందించాల న్నారు.ఈ సమావేశంలో డీఎస్పీలు నాగభూషణం, వెంకటేశ్వర రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ రవి, ఏవో సురేష్‌బాబు, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ నర్సింహ, సర్కిల్ ఇన్స్పెక్టర్లు రాజేష్, అంజనేయులు, శివశంకర్, పీఎన్డీ.ప్రసాద్, నాగార్జున, రాజశేఖర్, గౌరీనాయుడు,ఆర్ఐలు శ్రీనివాసరావు, శ్రీనివాస్, నర్సింహారావు, సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్,ఎస్సైలు, ఐటీ కోర్, డీసీఆర్బీ, స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది పాల్గొన్నారు.