Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి
నవతెలంగాణ-నార్కట్పల్లి
మూగజీవాలలో వచ్చే గర్భకోశ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని నెమ్మాని గ్రామంలో ఉచిత గర్భకోశ వ్యాధి నివారణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మూగజీవాల వ్యాధుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గర్భకోశ వ్యాధుల బారిన పడకుండా చూసుకొని ఈ అవకాశాన్ని సద్వినం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బురి యాదయ్య, వార్డ్ మెంబర్లు పంగ రమేష్ పాల సంఘం చైర్మెన్ అలుగుబెల్లి అనంతరెడ్డి రాజిరెడ్డి, డీవీఏ హెచ్ ఓ డాక్టర్ యాదగిరి, పశువైద్యాధికారులు ఏ.రవి, కట్ట జోష్న, వైద్య సిబ్బంది, జ్యోతి, సుజాత, అనిత, వెంకట్ రెడ్డి, శేఖర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.