Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ
ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే రజకుల అభివృద్ధి సాధ్యమవుతుందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో రూ.57 లక్షలతో బీసీ సంక్షేమ శాఖ, రజక ఫెడరేషన్ సమన్వయంతో పట్టణంలోని 28వ వార్డులో బెంగళూరు తరహా ఆధునిక దోబీ ఘాట్‌ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రజకులు మురికి కాల్వలో బట్టలు ఉతికి అనారోగ్యానికి గురి కాకుండా, హార్దికంగా బలోపేతానికై ముఖ్యమంత్రి కేసీఆర్ బెంగళూరు తరహా ఆధునింక దోబిఘాట్ నిర్మాణం 100శాతం సబ్సిడీతో నిర్మించడంతో పాటు లక్ష మందికిపైగా నెలకు 250 ఉచిత విద్యుత్ యూనిట్లు ఇవ్వడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో రజకులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అందించారన్నారు. కేంద్రంలో బీజేపీ బీసీ వ్యతిరేకత విధానం పాలన సాగిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ మందడి సైదిరెడ్డి, అదనపు కలెక్టర్ ఖుష్భు గుప్తా, వైస్ చైర్మెన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ కేవీ. రమణ చారి, జిల్లా వెనుకబడిన తరగతుల జిల్లా అధికారి, పుష్పలత, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షలు చక్రహరి రామరాజు, నాయకులు కంది సూర్యనారాయణ, కౌన్సిలర్లు ఎడ్ల శీను, కొమ్ము నాగలక్ష్మి, వట్టిపల్లి శ్రీనివాస్, ఖయ్యూం బేగ్, ఊట్కూరు వెంకటరెడ్డి, రజక సంఘం నాయకులు చిలకరాజు చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.