Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివరాలు వెల్లడించిన సీఐ సురేష్
నవతెలంగాణ-మిర్యాలగూడ
బైకు దొంగలు ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద 5 బైకులు, ఒక సెల్ ఫోను స్వాధీనపరచకున్నట్లు టూ టౌన్ సీఐ నిగిడాల సురేష్ తెలిపారు. బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించారు. పట్టణంలోని దుర్గా నగర్‌కు చెందిన శశి ప్రీతం, అశోక్ నగర్‌కు చెందిన పాతులోతు గౌతం, బాపూజీ నగర్‌కు చెందిన సకినాల మణిదీప్ నాయుడు ముటాగా ఏర్పడి చెడు అలవాట్లకు బానిసై దొంగతనాలు చేశారని తెలిపారు. గత ఆరు నెలల నుండి మిర్యాలగూడ దామరచర్ల ప్రాంతాలలో ఉదయం రాత్రి వేళలో పార్క్ చేసి ఉన్న మోటార్ సైకిల్‌ను దొంగతనం చేసేవారని తెలిపారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఆ సమయంలో పల్సర్ బైక్‌పై వచ్చిన ముగ్గురు పోలీసులు చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకొని విచారించగా దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపినట్టు చెప్పారు. వీరి వద్ద ఐదు బైకులు, ఒక సెల్ ఫోన్ స్వాధీన పరుచుకున్నామని, వాటి విలువ సుమారు రూ.లక్ష 85,000 ఉంటుందన్నారు. డీిఎస్పి వెంకటగిరి ఆధ్వర్యంలో కేసును దర్యాప్తు చేశామని, ఎస్సై కృష్ణయ్య, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు కేసును చేదించారని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, సైదిరెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.