Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామరచర్ల
మను సంస్కృతిని వ్యతిరేకిస్తూ కెేవీపీఎస్ ఆధ్వర్యంలో దామరచర్లలో బుధవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రేముడాల పరుశురాములు మాట్లాడుతూ ఫిబ్రవరి 15న కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో 1776లో మను అనే ఋషి రాసిన మనుధర్మ శాస్త్రాన్ని మళ్లీ యూనివర్సిటీ లాల్క్ పాఠ్య యాంశంగా ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. దీనికి వ్యతిరేకంగా దామరచర్లలో నిరసన వ్యక్తం చేసినట్లు చెప్పారు. భారత రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో మార్పు చేయాలనే కుట్రలో భాగంగా బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరికీ ఇబ్బందులు కలిగించే మను ధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుక రావడం భారత రాజ్యాంగాన్ని ముమ్మాటికి రద్దు చేయడమే అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి దళితులపై, అత్యాచారాలు, దాడులు, కుల, దుహంకార హత్యలు, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు అనేకం జరుగుతూనే ఉన్నాయన్నారు. ఎప్పుడో పూర్వకాలపు మన ధర్మ శాస్త్రాలు రెండు వేల పైచిలుకు ఉన్న శ్లోకాలు ముందుకు తీసుకురావడం ప్రజల మధ్య చీలిక తీసుకురావడం కోసం విభజించి ప్రజల్ని వేరువేరుగా కులాలుగా, మతాలుగా, చూడడం వల్ల ప్రజల ఐక్యత అభివృద్ధికి విఘాతం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బొల్లంపల్లి పాపారావు, కేవీపీఎస్ దామరచర్ల మండల అధ్యక్షులు రవి తదితరులు పాల్గొన్నారు.