Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
సామూహిక అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఫోక్సో చట్టం ప్రకారం ఆర్థిక సహకారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. గుర్రంపోడు మండలం మైలాపురం గ్రామానికి చెందిన బొంత కావ్యను నమ్మించి అంగడిపేట స్టేజి వద్ద అత్యాచారం, హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, మరణించిన కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ ఏవో మోతిలాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు, బాలికలపై లైంగిక దాడలు, హత్య చేసిన ఘటనలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని, అలాగే మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలను అరికట్టాలని డిమాండ్ చేశారు. కావ్య కేసును ప్రత్యేక కోర్టు ద్వారా, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది దర్శనం నరసింహను నియమించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కావ్య తండ్రి యాదయ్య, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.