Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాత ఫర్నీచర్‌ను సమీపంలోని అవసరమైన పాఠశాలలకు తరలించాలి
- రికార్డ్ రూం నిర్వహణ మెరుగుపర్చాలి
- కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి
- నార్కట్‌పల్లిలో విస్తృత పర్యటన, పలు అభివృద్ధి పనులు తనిఖీ
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తుందని జిల్లా కలెక్టర్ టీ.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా నార్కట్ పల్లి మండలంలో మోడల్ పాఠశాలలు ఇటీవల మౌలిక సదుపాయాలు కల్పించి ప్రారంభించిన నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల,ఎల్లారెడ్డి గూడ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ వినరు క్రిష్ణా రెడ్డి తనిఖీ చేశారు. అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం మండల పరిషత్ కార్యాలయం, ఏపీ లింగోటం గ్రామంలో క్రీడా ప్రాంగణం పరిశీలించారు. అధికారులతో మండలంలో అమలవుతున్న అభివృద్ధి పనులు ప్రభుత్వ పథకాలు రికార్డుల నిర్వహణపై పరిశీలన రివ్యూ చేశారు.
పాత పర్నిచర్ సమీపంలోని అవసరమైన పాఠశాలలకు తరలించాలి
మన ఊరు మన బడి,మన బస్తీ మన బడి కార్యక్రమంలో ఈ పాఠశాలలకు టాయిలెట్లు, పర్నిచర్,పెయింటింగ్,రిపేర్ లు, ప్రహరీ గోడ తదితర మౌలిక వసతులు కల్పించడం జరిగిందన్నారు. మన ఊరు మన బడి మన బస్తీ మన బడి లో కల్పించిన సదుపాయాలు నిర్వహణ ఇలాగే కొనసాగాలని, విద్యార్థులకు మంచి వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ కోరారు. ఈ పాఠశాలల్లో ఉన్న పాత పర్ని చర్ సమీపం లోని అవసరమైన పాఠశాలలకు తరలించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాల బలపడం కోసం కృషియాలని సూచించారు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రికార్డ్ రూం నిర్వహణ మెరుగు పరచాలి
నార్కట్ పల్లి తహశీల్దార్ కార్యాలయం సందర్శించి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, దరఖాస్తులు పరిష్కారం, సమస్యలపై సమీక్షించారు. రికార్డ్ రూం పరిశీలించి నిర్వహణ మెరుగు పరచు కోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఎం.పి.డి. ఓ కార్యాలయం సందర్శించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం లేబర్ టర్నోవర్,బృహత్ పల్లె ప్రకృతి వనాలు,తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పై సమీక్షించారు.మండలం లో 5 బృహత్ పల్లె ప్రకృతి వనంలు ఏర్పాటు చేయ వలసి వుండగా రెండు బృహత్ పల్లె ప్రకృతి వనం లు ఏర్పాటు చేసినట్లు,బ్రాహ్మణ వెళ్ళంల లో ఏర్పాటు పూర్తి కాగా,నార్కట్ పల్లి మొక్కలు నాటడం ప్రగతి లో వుందని ఎంపీడీఓ వివరించారు. మిగతా మూడు బృహత్ పల్లె ప్రకృతి వనంలు ఏర్పాటుకు స్థలాలు గుర్తించి పనులు మొదలు పెట్టాలని ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మండలం లో బుధవారం సరాసరి 22 లేబర్ టర్నౌట్ వుందని,ప్రతి రోజూ జి.పి.లో లేబర్ టర్మౌట్ 50కు పెంచాలన్నారు. ఏ.పి.లింగోటం లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణం తనిఖీ చేశారు. చుట్టూ ప్లాంటేషన్ చేసి ఉపయోగం లోకి తీసుకు రావాలని ఎంపీడీఓకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ యాదగిరి గౌడ్, తహశీల్దార్ సైదులు, ఎంఈఓ నర్సింహ, డిప్యూటీ తాసిల్దార్ మురళీమోహన్, ఏ పీ ఓ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.