Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
ఈ నెల 17 న జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఐ ఫంక్షన్ హాల్ పెద్దబండ, మిర్యాలగూడరోడ్లో నిర్వహించే సీపీఐ(ఎం) జిల్లా ప్లీనరీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులతో పాటు జిల్లా ప్రజా సంఘాల ఫ్రాక్షన్ కమిటీ సభ్యుల సకాలంలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి మిరియాల భరత్, సహాయ కార్యదర్శి వరుకుప్పల ముత్యాలు, యాసరాని శ్రీను, వేముల లింగస్వామి, వడ్లమూడి హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.