Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాలటౌన్
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డుకు చెందిన మంచాల మల్లయ్య కొద్దిరోజుల క్రితం చిట్యాల రహదారిపై జరిగిన ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నారు. మల్లయ్యది నిరుపేద కుటుంబం కావడంతో మున్సిపాలిటీ చైర్మెన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి సహకారంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వైద్య ఖర్చులు నిమిత్తం లక్ష రూపాయల ఎల్ఓసీని మంజూరు చేయించారు. సంబంధిత ఎల్ఓసీ చెక్కును మల్లయ్య కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చిలువేరు శేఖర్, గ్రంథాలయ కమిటీ చైర్మెన్ దాసరి నరసింహ, మంచాల గణేష్ తదితరులు పాల్గొన్నారు.