Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరి
ఇంటినుంచి పారిపోయి తప్పి పోయిన బాలున్ని, బంధువులకు అప్పగించిన సంఘటన గురువారం భువనగిరి లో చోటుచేసుకుంది. బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం జనగాం జిల్లా వడిచెర్ల గ్రామానికి చెందిన సాతెల్లి యాకయ్య ఏకైక కుమారుడు భరత్ కుమార్ (12), వడిచెర్ల గ్రామం లోని మై మాస్టర్ పబ్లిక్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్నాడు. గురువారం ఉదయం 8 గంటలకు బడికి వెళ్ళకుండా, జనగాం బస్టాండ్ కు వచ్చి, బస్ ఎక్కి భువనగిరి కి వచ్చాడు. భువనగిరి లో ఎక్కడికి వెళ్ళాలో తెలియక పట్టణంలోని శ్రీజ గ్యాస్ రిపేరింగ్ షాప్ వద్దకు వచ్చి కూర్చున్నాడు. షాప్ నిర్వాహకుడు ఉడుత రవి బాలున్ని చేరదీసి, భోజనం పెట్టించి,బాలల హక్కుల సంఘం నాయకులు కొడారి వెంకటేష్ కు సమాచారం ఇవ్వడంతో, ఆయన బాలుని వివరాలు తెలుసుకుని, బాలుని బందువులు భువనగిరి మండలం బొమ్మాయిపల్లి కి చెందిన చింతల మల్లేష్ కు సమాచారం ఇచ్చి బాలుడిని బంధువు మల్లేష్ కు అప్పగించారు. ఆ తరువాత బాలుని తండ్రి యాకయ్య తో మాట్లాడి బంధువులకు అప్పగించిన విషయం తెలియజేసారు. పిల్లల నడవడిక పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పిల్లల పట్ల అనునిత్యం తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం అని ఆయన కోరారు. బాలుడిని బంధువులకు అప్పగించిన సంఘటన పట్ల పలువురు అభినందించారు..