Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవసరమున్నంతవరకు వైద్యులు అందుబాటులో ఉంటారు
- రాష్ట్రవ్యాప్తంగా నూతన డాక్టర్ల నియామకం జరుగుతుంది
- అన్ని సదుపాయాలనూ మెరుగుపరుస్తాం
- రోగులకు చిరునవ్వుతో వైద్యం అందించాలి
- వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్
నవతెలంగాణ- రామన్నపేట
ఆస్పత్రి భవనం పూర్తిగా పాతబడిపోయిందని ఆస్పత్రిలో వైద్యులకు రోగులకు అందుతున్న సేవలను ఆస్పత్రి భవనాన్ని ,పరిసరాలను పూర్తిగా పరిశీలించామని, నివేదికను ప్రభుత్వం దష్టికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దష్టికి తీసుకెళ్తానని వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజరు కుమార్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఏరియాస్పత్రిని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్ ను, పిల్లల వార్డును, ప్రసూతి వార్డును, లేబర్ రూమును, జనరల్ వార్డును, బ్లడ్ బ్యాంక్ భవనాన్ని, పోస్టుమార్టం రూమును, పరిసరాలను డిస్టెన్స్రిని, ఆస్పత్రి భవనంలో ఉన్న ఆయుర్వేద వైద్యశాలను, పరిశీలించడంతోపాటు ఆసుపత్రి భవనం పైకి భవనాన్ని వాటర్ ట్యాంకులను పూర్తిగా పరిశీలించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ఆస్పత్రిలోని డాక్టర్లకు సిబ్బందికి అనేక సూచనలు చేశారు. కొత్త డిజిటల్ ఎక్సరే అందుబాటులో ఉన్నందున పాత ఎక్స్‌రే రే మిషన్ ను తిరిగి పంపించాలని ఆయన సూచించారు. రోగులను చిరునవ్వుతో పలకరిస్తూ వైద్య సేవలను అందించాలని సిబ్బందికి ఆయన ఈ సందర్భంగా సూచించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాస్పత్రులను సందర్శించి పరిశీలించాలని, పరిశీలించి ఆస్పత్రులపై నివేదిక నివ్వాలని సూచించడంలో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను పరిశీలిస్తున్నారని తెలిపారు. ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు మాత్రమే సేవలందిస్తున్నారని మరో నలుగురు వైద్యులు త్వరలో భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రి నుండి ఇక్కడికి డిప్యూటేషన్ మీద పంపిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలకు 208 మంది వైద్యుల నియామకం జరుగుతుందని, అందులో భాగంగా అన్ని ఆసుపత్రులకు నూతన వైద్యులు వస్తారన్నారు. రోగులకు అవసరం అవసరమున్నంత మంది వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. వంద పడకల ఆసుపత్రిగా అభివద్ధి చేయాలని సిపిఐ ఎం పార్టీ నాయకులు, స్థానిక సర్పంచ్ గోదాసు శిరీష పథ్వీరాజ్, ఎంపీటీసీ ఎండి రెహాన్ తో పాటు స్థానికులు ఇచ్చిన వినతి మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి 100 పడకల ఆసుపత్రిగా అభివద్ధి చేయడంతో పాటు నూతన ఆసుపత్రి భవన నిర్మాణానికి నిధులు మంజూరు కోసం ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. ఆసుపత్రి భవనం పెచ్చులు ఊడుతున్నదన వెంటనే మరమ్మతుల కోసం ఎస్టిమేట్ ఇవ్వాలని సూపర్ ఆదేశించామని ఆయన నివేదిక ఇచ్చిన వెంటనే తక్షణ మరమ్మతులు చేపడతామని ఆయన తెలిపారు. ఆయన వెంట జాయింట్ కమిషనర్ డాక్టర్ కె.వి రమేష్ కుమార్, డిసిహెచ్ఎస్ డాక్టర్ చిన్ను నాయక్, ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ వీరన్న, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ పోస్టులును భర్తీ చేయాలని వినతి
రామన్నపేట ప్రభుత్వాస్పత్రిలో తక్షణ సమస్యగా ఉన్న గైనకాలజిస్టు, అనస్తీషియా, కార్డియాలజిస్టు, జనరల్ ఫిజిషన్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఆస్పత్రి తనికీకి వచ్చిన తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజరు కుమార్ కు సీపీిఐ(ఎం) మండల కమిటి ఆద్వర్యంలో గురువారం వినతిపత్రం అందజేశారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యను వివరించారు. ఈ సందర్బంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి మాట్లాడుతూ సుమారుగా ఏడు మండలాల ప్రజలకు వైద్య సేవలందించే ఆస్పత్రి రోజుకు 300 మంది ఓపి వస్తుండగా కేవలం ముగ్గురు డాక్టర్లు మాత్రమే ఉండటంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆస్పత్రిపెచ్చులూడి రోగులపై పడుతున్నవని, ప్రభుత్వం వేంటనే స్పందించి, నూతన భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. తక్షణం స్పందించిన కమిషనర్ లేదు అజరు కుమార్ మరో నాలుగు డాక్టర్ పోస్టులు వెంటనే కేటాయిస్తున్నామని, మిగిలిన సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీిఐ(ఎం) మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల నాయకులు బోయిని ఆనంద్, కందుల హనుమంతు, నీల అయిలయ్య, వేముల సైదులు, పిట్టల శ్రీనివాస్, గంటెపాక శివ కుమార్, పల్లె సత్యం, మేట్టు శ్రవణ్ కుమార్, పండుగ రాజమల్లు, గుండాల భిక్షం, తాడూరి కష్ణ తదితరులు పాల్గొన్నారు.