Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరురూరల్
మండలంలో అనేకచోట్ల భూకబ్జాదారులు ఎక్కువ అవుతున్నారని ఎక్కడైనా భూమి ఖాళీగా ఉంటే వాటిని కబ్జా చేస్తున్నారని అలాంటి వారిని వెంటనే శిక్షించాలని ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎంఏ ఇక్బాల్, సీపీిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి జనార్ధన్ ,సీపీిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెక్క వెంకటేష్ కాంగ్రెసు పట్టణ అధ్యక్షులు ఎజాస్ అన్నారు. గురువారం ఆవాజ్ ఆధ్వర్యంలోతహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిలపక్షాలు, కొలనుపాక గ్రామస్తులు దర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని సర్వే నెంబర్ 1646 47 లోని 13 ఎకరాల 38 గుంటల వక్సు బోర్డు భూములను రక్షించడంలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. కొలను పాక భూములకు సంబంధించి హైకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఆ తీర్పును అమలు చేయడం కోసం అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. అధికారులు, కబ్జాదారులు కలిసి ఆడిందే ఆట పాడిందే పాటగా నడుస్తుందన్నారు. అనంతరం తహసీల్దార్ రామకష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ , బీజేపీ పట్టణ అధ్యక్షులు బడుగు జాంగిర్ ,బీఎస్పీ జిల్లా నాయకులు తుంగ కుమార్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు అడివయ్య, ఆవాజ్ జిల్లా నాయకులు లతీఫ్, అఖిలపక్ష కన్వీనర్ సలీం, వైయస్సార్ తెలంగాణ నియోజకవర్గం కోఆర్డినేటర్ నరేష్, బీఎస్పీ మండల అధ్యక్షులు నవీన్, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి రాజేష్ ,బిజెపి నాయకులు సుభాష్ ,సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సంఘీ రాజు ,మజీద్ కమిటీ అధ్యక్షులు అజ్మత్, ఖలీల్, కొలనుపాక మజీద్ కమిటీ అధ్యక్షులు సయ్యద్ మజాహార్, ఎండి ఇబ్రహీ ,రియాజ్ ,ఉస్మాన్, సయ్యద్, అబ్బాస్ ,ఇమ్రాన్ ,గౌస్ ,బాబా, భాష, సమీర్ తదితరులు పాల్గొన్నారు.