Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ- నూతనకల్
ఆలయాలు మన సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయాలని అలాంటి ఆలయాలను గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకొని భక్తి భావాన్ని పెంపొందింప చేసుకో వాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవ ద్వజారోహణ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తిని కలిగి ఉండాలని, ఆధ్యాత్మికతతోనే మనసు ప్రశాంతత దొరుకుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆలయం చుట్టూ సిసి రోడ్డు నిర్మాణానికి ఎంపీ నిధుల నుండి పది లక్షల రూపాయలను కేటాయించి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీగల గిరిధర్ రెడ్డి, పగిళ్ల అశోక్ రెడ్డి, కొంపల్లి మల్లారెడ్డి,తోణుకునూరి సైదులు గౌడ్, పెద్దనేమిల గ్రామ సర్పంచ్ మరాటి రామస్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆలయ కమిటీ సభ్యులు, , గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
దైవభక్తితో మనసుకు ప్రశాంతత : ఎమ్మెల్యే
దైవభక్తితో మనసుకు ప్రశాంతత లభిస్తుందని ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ లు అన్నారు.గురువారం మండల పరిధిలోని వెంకేపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం, ద్వజారోహణ మహౌత్సవ కార్యక్రమలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దైవభక్తని కలిగి ఉండడంతో పాటు స్నేహ భావంతో మెలగాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి, జడ్పీటీసీ కందాల దామోదర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ కనకటి వెంకన్న, సర్పంచ్ మాతంగి సోమనరసమ్మ ఎల్లయ్య బి ఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మున్న మల్లయ్య యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి బత్తుల సాయిలు గౌడ్, పన్నాల సైదిరెడ్డి ,మల్లారెడ్డి చూడి లింగారెడ్డి గార్డుల లింగరాజు, యాస ఎల్లారెడ్డి , కనకటి మహేష్ గౌడ్ ఆలయ కమిటీ సభ్యులు, నాయకులు, గ్రామ పెద్దలు, భక్త ప్రజలు తదితరులు పాల్గొన్నారు.