Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీఆర్ఎస్ హయంలోనే ఆలయాలకు పూర్వవైభవం
- విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి
నవతెలంగాణ- సూర్యపేటరూరల్
గ్రామ దేవాలయాలు సమైక్యతకు నిలయాలని, ఆధ్యాత్మికతతోనే గ్రామాలలో ప్రశాంత వాతావరణం నెలకొంటుందని,బీఆర్ఎస్ ఆయంలోనే ఆలయాలకు పూర్వ వైభవమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు గురువారం సూర్యాపేట మండల పరిధిలోని ఎండ్లపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ ఆంజనేయ సమేత కోదండ రామాలయం విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు యాగశాలలో, హోమ కార్యక్రమంలో మంత్రని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పురాతన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. దేవాలయ అభివద్ధి లకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిధులు కేటాయిస్తుందని తెలిపారు.అన్ని మతాలకు సమన్యాయం, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే లభిస్తుందని అన్నారు. మతాల కనుగుణంగా ప్రభుత్వమే పండగలను నిర్వహించడం అనేది, దేశంమొత్తంలో కల్లా,తెలంగాణలో మీనా ఎక్కడ లేదన్నారు. అనంతరం తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించి మేమెంటోతో సత్కరించారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు,డీసీఎంఎస్ చైర్మన్ ఒట్టే జానయ్య యాదవ్, ఎంపీపీ బీరవోలు రవీందర్ రెడ్డి,జెడ్పిటిసి జీడి భిక్షం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ గుండా లక్ష్మయ్య, గౌరవ అధ్యక్షులు దండి రమేష్, వైస్ చైర్మన్ వెంకట నాగిరెడ్డి,కార్యదర్శి యనాల రాంరెడ్డి,కొంపెల్లి శ్రీనివాస్, సర్పంచ్ దండి సుగుణమ్మ ,ఎంపిటిసి కుంట్ల సరిత అనంతరెడ్డి, కుంట్ల వెంకట నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.