Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
నవతెలంగాణ- నూతనకల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు బండి నాగెల్లి యాదగిరి పోరాట చరిత్రను యువత పూర్తిగా తీసుకొని సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండల పరిధిలోని ఎంకేపల్లిలో బండి యాదగిరి స్థూపం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గురువారం మండలంలోని వెంకీపల్లి గ్రామంలో శ్రీ సీతారామ ఆంజనేయస్వామి ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠాపన మహా ఉత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడడం వల్ల ప్రజల్లో ఎన్నో ఆశలు ఆకాంక్షలు నెలకొల్పాయని అవి సాధించేంతవరకు నేటి యువత ముందుండి పోరాడవలసిన అవసరం ఉన్నదని అన్నారు .తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులు మొదటి నుండి ఈ త్వరలో భూస్వాముల ప్రజా వ్యతిరేక విధానాలకు ను వ్యతిరేకిస్తూ ప్రజల అభివద్ధి కోసం పోరాదరని, నైజాం నవాబ్ పాలనకు వ్యతిరేకంగా రైతాంగ సాయుధ పోరాటాన్ని నిర్వహించారన్నారు. తెలంగాణ ఏర్పడి తర్వాత కూడా రాష్ట్రంలో కుటుంబ నియంత పాలన సాగుతుందని ఈ విధానాలను సీపీఐ(ఎం) వ్యతిరేకిస్తుందిని అన్నారు. ఈ దేశంలోబీజేపీి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయాన్ని మతోన్మాదానికి మార్చి రాష్ట్రాన్ని రాజుల పాలనకు నెట్టాలని చూస్తున్నది రాష్ట్రానికి మతోన్మాదాన్ని దరిదాపుగా రాకుండా చూడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రజల ఆశలను ఆకాంక్షలను నెరవేర్చి నవతెలంగాణ నిర్మించి సమ సమాజాన్ని స్థాపించడం కోసం కషి చేయాలన్నారు, ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు కందాల శంకర్ రెడ్డి మండల కమిటీ సభ్యులు బత్తుల జనార్ధన్ ఉప్పలయ్య సైదులు కష్ణారెడ్డి సురేందర్ రెడ్డి లింగమల్లు ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు