Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థులు క్రీడా స్పూర్తిని అలవర్చుకోవాలి : ఎమ్మెల్సీ కోటిరెడ్డి
నవతెలంగాణ-పెద్దవూర
మండలం లోని చింతపల్లి గ్రామంలో తెలంగాణ తొలి దళితకవి శివభక్తుడు దున్న ఇద్దాదాసు జయంతి ఆరాదనోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి మహిళల కబడ్డీ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. గురువారం జరిగిన ఈ క్రీడాపోటీలకు ఎమ్మెల్సీ కోటిరెడ్డి ముఖ్యఅతిధిగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకోని మాట్లాడారు. విద్యార్థులు క్రీడాస్పూర్తిని అలవర్చుకోవాలన్నారు. లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో మాట్ పై అంగరంగ వైభవంగా న్యూకిడ్స్ ఉన్నత పాఠశాల అబ్బాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మెన్ ఎస్కే. అబ్బాస్ సౌజన్యంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కర్తయ్య గౌరవ అధ్యక్షులు గర్లపాటి శేఖర్ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో 18 రాష్ట్రాల జట్లు పాల్గొనగా క్రీడాకారులు గెలుపుకోసం తమ శక్తిని ఒడ్డుతున్నారు. గాయాల్ని సైతం లేక్కచేయకుండా గెలుపే లక్ష్యంగా క్రీడాస్ఫూర్తిని ప్రదర్శిసున్నారు. గురువారం తెలంగాణ కేరళ జట్ల మధ్య పోటీ ఉత్కంట భరితంగా జరిగింది. ఈ పోటీలో తెలంగాణ జట్టు రెండు పాయింట్లతో విజయం సాధించింది. తెలంగాణ జట్టులో అయేషా ముందుండి వియయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సుంకిరెడ్డి ప్రభావతి సంజీవరెడ్డి, ఎంపీటీసీ జ్యోతిక్రిష్ణ, ఉపసర్పంచ్ భారతి కొండలు, సీనియర్ క్రీదాకారులు పల్లెబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.