Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్/ సూర్యాపేట కలెక్టరేట్
ఈనెల 26 నాటికి పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో కలిసి కంటి వెలుగు, పోడు భూములు ప్రభుత్వ జీఓల ప్రకారం చేయవలసిన క్రమబద్దీకరణ, తెలంగాణకు హరితహారం, రెండు పడక గదుల నిర్మాణాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడారు. ప్రధాన కార్యదర్శి ఆడిగిని విషయాలపై జిల్లా కలెక్టర్ టీ.వినరు క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ పట్టణ ప్రాంతాలలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక చేసి పోర్టల్లో అప్లోడ్ పూర్తి చేస్తామని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు ఖుష్భు గుప్తా, భాస్కర్రావు, డీఎఫ్ఓ రాం బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కొండల్ రావు, గహ నిర్మాణ పీడీ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలో 84 మంది పోడు లబ్ధిదారులను జిల్లా స్థాయి కమిటీ ఆమోదించడమైనదని చీఫ్ సెక్రటరీకి కలెక్టర్ తెలిపారు. పట్టాదారు ఫోటోను ఇతర వివరాలను పోలీ గాన్ లో చెక్ చేసి పట్టా పాస్ పుస్తకాల ముద్రణకు పంపనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు.ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్ మోహన్ రావు, డి.ఎఫ్.ఓ. సతీష్ , ఆర్.డి.ఓ. రాజేంద్ర కుమార్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం, డి ఆర్ డి ఓ కిరణ్ కుమార్, డిపిఓ జానయ్య, డి టి డబ్ల్యూ కే శంకర్, సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.