Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
వేసవి సమీపిస్తున్న తరుణంలో త్రాగునీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ కేవీ.రమణాచారి సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపల్‌శాఖ ఇంజనీర్లు, ఫిట్టర్, లైన్మెన్లతో మున్సిపల్ సమావేశ మందిరంలో రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి నల్లగొండ పట్టణంలో నీటి సప్లై పై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజర్వాయర్ల కెపాసిటీ ఆధారంగా నల్లగొండ పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని సప్లై చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజు ఒక వ్యక్తికి 135 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా రెండు రోజులకోసారి 270 లీటర్లకు పైనే నిటిని అందిస్తున్నామని తెలిపారు. జనాభాను బట్టి ప్రతిరోజు 30 ఎమ్ఏల్డీ నీటిని డ్రా చేయాలని ఉన్నప్పటికీ 35ఎంఏల్ డీి(3.50 కోట్లు ) నీటిని డ్రా చేసి నల్లగొండ పట్టణంలోని సుమారు 40 వేలకు పైగా గహాలకు నీటిని సప్లై చేస్తున్నామని వివరించారు. నీరు లేని ప్రాంతాలు, కొత్తగా వెలసిన కాలనీలు ఐదు శాతం ఉంటాయని అక్కడ నీటిని సప్లై చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పవర్ బోర్ లు 200 కు పైనే ఉన్నాయని, 400కు పైగా ఉన్న చేతిపంపులను వెంటనే రిపేర్ చేయించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్‌శాఖ ఈఈ రాములు, డీఈ వెంకన్న, ఏఈ దిలీప్, మున్సిపల్ శాఖ పిట్టర్లు, లైన్మెన్లు, ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.