Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునుగోడు
పచ్చని పంట పొలాల పై ఆధారపడి జీవనం కొనసాగించే రైతులకు నష్టం కలిగించే టీఎస్ ఐ పాస్ ద్వారా మునుగోడు మండలంలోని కిష్టాపురం గ్రామంలో సన్ లైట్ ఇంగ్రిడియంట్స్ ఫార్మా కంపెనీకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని గురువారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మండల అఖిలపక్షాల నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాధర్నాలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, నియోజకవర్గ ఇన్చార్జి బండ శ్రీశైలం, సీపీిఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పున్న కైలాస్ నేత, చలమల కష్ణారెడ్డి, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, వైస్ ఎంపీపీ అనంత వీణ లింగస్వామి మాట్లాడారు. గాలి, నీరు, ప్రజలు జీవన విధానానికి విరుద్ధంగా వెలువడే రసాయనాల ఫార్మా కంపెనీ అనుమతులను రద్దు చేసే వరకు పార్టీలకు అతీతంగా ఉద్యమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్మా కంపెనీ వ్యతిరేక కమిటీ అధ్యక్షుడు, కిష్టాపురం ఎంపీటీసీ భీమనపల్లి సైదులు, చాపల మారయ్య, అఖిల పక్ష నాయకులు మేకల ప్రదీప్ రెడ్డి, జాజుల అంజయ్యగౌడ్, పోలగోని సత్యం, పోలగొని సైదులు, జక్కలి శ్రీను, తాటికొండ సైదులు, మిర్యాల వెంకన్న, జనగాం రవి గౌడ్, గురిజ రామచంద్రం, సురిగి చలపతి, యాదవరెడ్డి, ఈసరి యాదయ్య, నకరకంటి యాదయ్య,వంటేపాక వెంకన్న, బొల్గురి నర్సింహ, తీర్పారి వెంకన్న, ఈదులకంటి కైలాష్, అనగంటి కష్ణ, చెరుకు కష్ణయ్య, జీడిమెట్ల రవీంద్రర్, బొజ్జ శ్రీను, జాజుల పారిజాత, తదితరులు పాల్గొన్నారు.