Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్సిస్టు) నల్లగొండ జిల్లా స్థాయి విస్తత సమావేశం శుక్రవారం పట్టణంలోని పెద్ద బండ ఎఫ్‌సీఐ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు అపార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో నల్లగొండ జిల్లాలో స్థానికంగా ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశానికి జిల్లాలోని సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శులు, జిల్లా, మండల కమిటీ సభ్యులు, సకాలం కార్యకర్తలు హాజరు కావాలని కోరారు.