Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాత భాషను మరచిపోతే కన్న తల్లిని మరచిపోయినట్టే
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ- సూర్యాపేట
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ బోధనలు ప్రపంచ మానవాళికి ఆచరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక బంజారా భవన్లో జరిగిన సేవాలాల్ 284వ జయంతి ఉత్సవాలు భోగ్ బండార్ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. సేవాలాల్ భోధనలను ప్రతిఒక్కరూ ఆచరించాలన్నారు. మానవ నాగరికత పరిణామక్రమంలో అనేక మార్పులు చెందుతూ వస్తుందని, కాలంతో పాటు భాష, వస్త్రధారణ, అలవాట్లు మారుతున్నాయని పేర్కొన్నారు. సమాజంలో ప్రజలు సన్మార్గంలో పయనించడానికి కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు నెలకొల్పారని మంత్రి అన్నారు. ఆంగ్ల భాష వ్యామోహంలో రేపటి తరానికి మాత్ర్రభాషను దూరం చేయవద్దని పేర్కొన్నారు. భాషను మరవిపోవడం అంటె కన్నతల్లిని, సంస్కతిని మరచిపోవడమే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రములో అన్ని ఆచార, సంప్రదాయాలకు సముచిత స్థానం లభిస్తుందని చెప్పారు.సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రములోని లంబాడి తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించిన ఘనత సిఎం కెసిఆర్ దే అన్నారు. లంబాడి తండాలు ఘర్షణ లేని వాతావరణంలో జీవించాలని, సంత్ సేవాలాల్ భోధనలు పాటించాలన్నారు. కోరికలే అనర్దాలకు మూలం కాబట్టి చెడు ఆలోచనలు, కోరికలను మంటలలో దహింపచేయడమే భోగ్ బండార్ అని మంత్రి పేర్కొన్నారు.ఆర్డీవో రాజేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గిరిజన సహకార సంస్ధ చైర్మన్ రాంచందర్ నాయక్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, చివ్వెంల జెడ్పిటిసి సంజీవ్ నాయక్, ఎంపీపీ ధరావత్ కుమారి బాబు నాయక్, ఎంపీటీసీ సభ్యురాలు లూనావత్ శాంతాబాయి పండు నాయక్, రిటైర్డ్ డిటిడిఓ లూనావత్ పాండు నాయక్, బిక్షం నాయక్, బాబు నాయక్, ఉద్యోగ సంఘం నాయకులు మోతిలాల్ నాయక్, భద్రు నాయక్, ధారసింగ్ నాయక్, పాండు నాయక్, వెంకన్న నాయక్, బాలు నాయక్, రాజేష్ నాయక్, కౌన్సిలర్ లు పలువురు లంబాడీ గిరిజన ప్రముఖులు, రాజకీయ, ఉద్యోగ, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.