Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-దామరచర్ల
అర్హులైన పేదలందరి ఇండ్లు, స్థలాలు, రేషన్ కార్డులు పింఛన్లు, పోడు భూములు పట్టాలివ్వాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి నేటికీ 75 సంవత్సరాలు పూర్తయినా కానీ ఈ దేశంలో ఇప్పటికీ పేదలకు ఇండ్లు, ఇల్లు స్థలాలు లేకపోవడం దురదష్టకరమన్నారు. అధికారులు పాలకులు అర్హులైన పేదవారందరినీ గుర్తించి వాళ్ళందరికీ ఇండ్లు, ఇండ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్స్, పోడు భూములు హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ప్రభుత్వం మూడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ధరలకు అనుగుణంగా సుమారు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా దామరచర్ల మండల కేంద్రంలో ప్రభుత్వ భూములు ఉన్నాయని, నిరుపేద కుటుంబాలను గుర్తించి వెంటనే వారందరికీ కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వాళ్లందరి సమీకరించి దామరచర్ల మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహి స్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బింగ్ మల్లేష్, పార్టీ మండల కార్యదర్శి మాలోతు వినోద్ నాయక్, సీనియర్ నాయకులు పాపానాయక్, సీఐటీయూ నాయకులు దయానంద్, సుభాని, రైతు సంఘం నాయకులు కోటిరెడ్డి, ఎర్రనాయక్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోపి, గిరిజన సంఘం నాయకులు శ్రీను, ఆటోమొబైల్ నాయకులు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.