Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
నవతెలంగాణ -మోటకొండూర్
గ్రామ పంచాయతీ కార్మికులకు రూ.10లక్షల ప్రమాదబీమా చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చూస్తు చేపట్టిన గ్రామపంచాయతీ సిబ్బంది పాదయాత్ర గురువారం మోటకొండూరు మండల కేంద్రానికి చేరుకుంది. పాదయాత్ర 100 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా సెంటర్లో కేక్ కట్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ా బస్టాండ్ ఆవరణలో జరిగిన బహిరంగ సభ లో పాదయాత్ర రథసారథి , సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు. లేబర్కోడ్ల వల్ల దీనివల్ల గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక చట్టాలు వర్తింపజేయకుండా కుట్ర పన్నిందన్నారు. ఎంతో కాలం నుండి కనీస వేతనం ఇవ్వాలని కార్మిక సంఘాలు పోరాడుతుంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. కనీస వేతనం రూ.20వేల ఇవ్వాలని, జీవో నెంబర్ 60 ప్రకారం చెల్లించాలని మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని 10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 76 ఏళ్ల స్వతంత్రంలో నిర్లక్ష్యం నిరాదరణకు గురైన వారు పంచాయతీ కార్మికులే అన్నారు గ్రామపంచాయతీ సిబ్బందిలో అత్యధికలు దళితులు గిరిజనులు బలహీన వర్గాలకు చెందిన పేదలు పాలకులు మారిన వీరు బతుకులు నామ మాత్రపు వేతనాలు పెంచి రాష్ట్రప్రభుత్వం గ్రామపంచాయతీ సిబ్బంది మెడకు ఉరితాడు బిగించారని వివిధ కేటగిరీలను రద్దు చేసి మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని తీసుకొ చ్చారని పర్మినెంట్ తో పాటు వేతనాలు పెంచాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 51 సవరించి కారోబార్ బిల్ కలెక్టర్ కు స్పెషల్ స్టేటస్ కల్పించాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కొల్లూరు ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన ఈ పాధయాత్రలో పాదయాత్ర బృందం సభ్యులు గ్యార పాండు చాగంటి వెంకటయ్య, పైళ్ళ గణపతి రెడ్డి, తునికి మహేష్ ,వినోద్ కుమార్,ాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్, రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ జగదీష్ ,గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు దాసరి పాండు, జిల్లా అధ్యక్షులు కల్లూరు మల్లేశం పొట్ట యాదమ్మ గోసంగి పరమేష్ ఆడెపు స్వామి బోగారం వీరస్వామి, గంధముల నరసింహ ,భువనగిరి వెంకటేష్ ,తిరుమలమ్మ, భాగ్య ఇస్తారు, రాములు, దయాకర్ ,సుదర్శన్, ఎల్లమ్మ, లక్ష్మి ,బాలయ్య, మల్లేష్ ,అంజయ్య, పద్మ ,మణెమ్మ ,జాంగిర్ ,తదితరులు పాల్గొన్నారు.
కనీస వేతనం 26000 ఇవ్వాలి
సిఐటియు జిల్లా అధ్యక్షులు కల్లూరి మల్లేశం
ఆలేరు రూరల్: ఉదయం లేచిన మొదలుకొని ఊరిలో ఉన్న చెత్త చెదారాన్ని తీసేసావ్ వారు అయినటువంటి గ్రామపంచాయతీ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కల్లూరు మల్లేశం అన్నారు .గురువారం మండలంలోని ది లవ రిపూరు గ్రామంలో వారు మాట్లాడుతూ సిఐటియు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్న కామ్రేడ్ లకు ముందుగా ధన్యవాదాలు తెలిపి ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు నిర్ణీత పని గంటలు నిర్ణయించాలని కనీసం వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు కల్పించాలని కోరారు. గ్రామపంచాయతీ కార్మికులు పేదవారు కావడంత వారికి ఏమైనా ప్రమాదం జరిగితే డబ్బులు పెట్టలేదు కాబట్టి మేడిక్ లైవ్ అందుబాటులో ఉంచి మెడికల్ కు సంబంధించిన డబ్బులు ప్రభుత్వం అందజేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆడెపు స్వామి, సంఘీ రాజు ,చెక్క దశరథ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.