Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కోసమని వెళ్లిన మహిళలు అనంత లోకానికి
- దండు మల్కాపురం గ్రీన్ ఇండిస్టియల్ పార్కులో ఘోర రోడ్డు ప్రమాదం
- నలుగురు మహిళలు మతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు
- మతులు ఒకే గ్రామానికి చెందినవారే
- దేవలమ్మ నాగారం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు
నవతెలంగాణ- చౌటుప్పల్‌రూరల్
రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి పనులు ముగించుకున్న మహిళలు, ఉపాధి కోసం కంపెనీకి బయలుదేరారు. పొట్టకూటి కోసం మహిళలు ఆటోలో వెళుతుండగా అతి వేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢకొీనగా అందులో ప్రయాణిస్తున్న మహిళలు ముగ్గురు అక్కడికక్కడే మతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరో మహిళ తనువు చాలించింది. ఈ హదయవిషాదకరమైన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలోని గ్రీన్ ఇండిస్టియల్ పార్కులో గురువారం ఉదయం జరిగింది. మతుల్లో నలుగురు మహిళలు, క్షతగాత్రులు ఒకే గ్రామం దేవలమ్మ నాగారం గ్రామానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి ఇలా... దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన మహిళలు గ్రీన్ ఇండిస్టియల్ పార్కులో ఉన్న తేజస్వీ ఫుడ్ ఇండిస్టీస్ (పచ్చళ్ళ కంపెనీ) లో కూలి పనులకు వెళ్తుంటారు. రోజువారిలో భాగంగా గురువారం ఉదయం దేవలమ్మ నాగారం గ్రామం నుండి ఏడుగురు మహిళలు ఆటోలో బయలుదేరారు. ఆటోలో వెళ్తూ కష్టసుఖాలు చెప్పుకుంటున్న మహిళలు మరో నిమిషంలో కంపెనీలోకి చేరుకుంటున్న సమయంలో బస్సు ప్రమాదానికి గురయ్యారు. కంపెనీకి 100 మీటర్ల దూరంలో ఉన్న ఓ కూడలి వద్ద అదే కంపెనీకి చెందిన బస్సు అతివేగంగా వస్తూ మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢకొీట్టింది. సుమారు 30 మీటర్ల వరకు ఆటోను లాక్కెళ్ళింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న మహిళలు వరకాంతం అనసూయ (55), చిలువేరు ధనలక్ష్మి ( 35), డాకోజు నాగలక్ష్మీ (28) లు అక్కడికక్కడే తీవ్ర గాయాలైన దేవరపల్లి శిరీష (30) ను చికిత్స కోసం తరలిస్తుండగా మరణించింది.ఆటో డ్రైవర్ కొండ వెంకటేష్,ఇతని భార్య కావ్య, కురుమిద్ద యమునా, కోయగూర అఖిల లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాదులోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ఇందులో కురిమిద్ద యమునా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం యశోద హాస్పిటల్ కు తరలించారు. మతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
- మతులంతా భూమిలేని పేదలే....
ఈ ఘటనలో మతి చెందిన మతులంతా దేవలమ్మ నాగారం గ్రామానికి చెందిన వారే. వీరిలో ఎవరికి ఎకరంకుమించి భూములు లేవు. అందరిదీ ధీనగాదే.
- ఉన్నది ఎకరం భూమి...చెరువులో మునిగింది..
పెద్ద వయసు వచ్చిన కాయ కష్టం చేయనిది కడుపులోకి ముద్ద దిగిన పరిస్థితి వరకాంతం అనసూయది. భర్త రామ్ రెడ్డి వద్ధాప్యంతో ఉన్నారు. వీరికి ముగ్గురు కూతుర్లు. అందరి పెళ్లిళ్లు చేశారు . కొడుకు కు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఉన్న ఎకరం భూమి చెరువులో మునిగిపోయింది. దీంతో చేసేదేమీ లేక కూలి పనులకు వెళ్తూ జీవనం గడుపుతున్నారు. కుటుంబాన్ని కాయ కష్టం చేస్తూ కూతుర్ల పెళ్లిళ్లు చేసిన కుటుంబ పెద్దదిక్కు అనసూయ మరణించడంతో కుటుంబంలో విషాదంలో ఉంది
- భర్తకి చేదోడుగా..... కూలి పనికి
తాత ముత్తాతలు సంపాదించిన భూమి లేదు. ఇనాం భూమి ఉంది. వ్యవసాయానికి యోగ్యం కాకపోవడంతో చేతి వత్తులైన వత్తిని చేస్తున్నారు భర్త రమేష్. భర్త కష్టాన్ని అర్థం చేసుకున్న భార్యగా భర్త సంపాదనకు తోడుగా కూలి పనులకు వెళ్తుంది డాకోజీ నాగలక్ష్మి. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబం గడవాలన్నా, పిల్లలను చదివించాలన్న రోజు పనికి వెళ్లక తప్పదు. పిల్లల ఆలన పాలన చూసుకునే తల్లి ప్రమాదంలో మతి చెందడంతో పసి హదయాలు విలపిస్తున్నాయి.
- బిడ్డ చనిపోయిన విషాదం నుండి కోల్పోక ముందే.....
గ్రామంలో ఎలక్ట్రిషన్ వర్క్ చేరుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న శేఖర్ రెడ్డి - శిరీష దంపతుల కూతురు ఏడాది కిందట మరణించింది. ఆ ఘటన నుండి తీరుకోకముందే భార్య శిరీష ఆటో ప్రమాదంలో మరణించడం తీవ్ర కలకలం సష్టిస్తుంది. రోజు కూలి చేస్తేనే గడుస్తున్న కుటుంబంలో ఆటో ప్రమాదం తీరని దిగ్భ్రాంతిని మిగిల్చింది. శిరీష కూతురు ఏడాది కిందట మరణించగా, కొడుకు ఉన్నాడు.
- బీద కుటుంబంతో.... కూలి పనులకు
చేతి వత్తుల కునారిల్లిన ఈ కాలంలో గ్రామంలో ఉపాధి లేకపోవడంతో బోర్ బండి పై లేబర్‌గా పనిచేస్తున్న సిలువేరు బిక్షపతి. కుటుంబ పోషణ కోసం భర్త దూర ప్రాంతాలకు వెళ్లడానికి గమనించిన బిక్షపతి భార్య ధనలక్ష్మి తాను కూలి పనికి వెళ్లి భర్తకు తోడుగా నిలిచింది. ధనలక్ష్మి ఇండిస్టియల్ పార్కులోనీ కంపెనీలో రోజువారి కూలిగా పనిచేస్తుంది. వీరికి భూమి లేదు. కొడుకు, కూతురు ఉన్నారు. తల్లి మరణించడంతో దిక్కులేని వారిగా మిగిలిపోయారు.
ఇలా ఏ కుటుంబాన్ని కదిలించిన కడుబిదలే. పొట్టకూటి కోసం కూలి పనులకు వెళితే రోడ్డు ప్రమాదంలో మరణించడం వీరి కుటుంబాల్లో తీరని శ్లోకాన్ని మిగిల్చింది.
- దేవలమ్మ నాగరంలో అలముకున్న విషాదఛాయలు..
మండలంలో ఏ గ్రామంలో కూడా ఒకేసారి ప్రమాదంలో ఎంతమంది చనిపోయిన సంఘటనలు అరుదు. ఇండిస్టియల్ పార్కులో ఆటో ప్రమాదంలో చనిపోయిన మతులు, క్షతగాత్రులు అందరిదీ ఒకే గ్రామం. ప్రతిరోజు దేవలమ్మ నాగారం గ్రామం నుండి 12 మంది మహిళలు గ్రీన్ ఇండిస్టియల్ పార్కులో ఉన్న తేజశ్రీ ఫుడ్ కంపెనీలో కూలి పనులకు వెళ్తుంటారు. గురువారం నలుగురు మహిళలు వెళ్లలేదు. ఆటోలో వెళుతున్న ఎనిమిది మందిలో నలుగురు మహిళలు ఒకేసారి మతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. మతుల కుటుంబాలు కన్నీరు మిగిలింది. ఈ హదయ విషాదకరమైన ఘటన జరగడం ప్రతి హదయాన్ని కలచివేసింది. మతుల కుటుంబాల శోకాలతో గ్రామం గుండె పగిలేలా విలపిస్తోంది.
- మతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన...
గ్రీన్ ఇండిస్టియల్ పార్కులోనిన్ తేజ శ్రీ ఫుడ్ కంపెనీలో కూలి కోసం వచ్చిన కూలీలు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానిక నాయకులు, గ్రామస్తులు కంపెనీ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. మతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు చికిత్స చేయించాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు ఆందోళనలతో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చౌటుప్పల్ ఏసిపి ఉదరు రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు చేపట్టారు.