Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో నిర్వహిస్తున్న క్రీడ పోటీలలో మహిళలు పురుషులతో సమానంగా అన్నిట్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టినరోజు సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో విజయం సాధించిన వారికి బహుమతులు,సర్టిఫికెట్లు జిల్లా కలెక్టర్ అందజేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలలో విజయం సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం ఎం. అక్షయ, ద్వితీయ స్థానం సి హెచ్ దివ్యభవాని, తతీయ స్థానం బి. శ్వేత లను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ పోటీలలో ప్రథమ, ద్వితీయ స్థానం సాధించిన వారిని నెడు ఎల్ బి స్టేడియం, హైదరాబాదు నందు జరిగే రాష్ట్ర స్థాయి చెస్ పోటీలకు పంపించడం జరుగుతుంది తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు,జిల్లా యువజన క్రీడల అధికారి బి. వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు జి కపాకర్,నేషనల్ చెస్ ఆర్బిటర్ వై అనిల్ కుమార్, ఎల్ సతీష్ కుమార్,మహిళా చెస్ క్రీడాకారులు పాల్గొన్నారు.