Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు
నవతెలంగాణ-పెన్ పహాడ్
మండల కేంద్రంలోని కస్తూర్బా, ఆదర్శ పాఠశాల, వివిధ ప్రభుత్వ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాంబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా వారి కనీస వేతనం పెంచాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించి వాళ్ల ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాలీ చాలని వేతనాలతో కుటుంబాన్ని పోషించలేక తీవ్ర మనస్థాపానికి గురవుతున్నారని, సుప్రీంకోర్టు తీర్పును అమలు పరచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు రణపంగ కష్ణ, కాంటాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు సంతోష్‌రెడ్డి, జానిపాషా, అమత, రజియా, రమాదేవి, మధులత, ప్రమీల, సైదులు, శివ, విశ్వం తదితరులు పాల్గొన్నారు.