Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండడెస్క్
వ్యవసాయ పంపుసెట్లకు ఆటోమేటిక్ స్టాటర్లను తొలగించాలనే రాష్ట్ర ప్రభు త్వ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శుక్రవారం సూర్యాపేట జిల్లా మునగాల మండలకేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో పార్టీ మండల కమిటీ సమావేశం వీరబోయిన వెంకన్న అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే త్రీఫేస్ కరెంటు అందక రైతులు తిప్పలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.విద్యుత్ ఎప్పుడొస్తుందో..ఎప్పుడు పోతుందో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు.దీంతో రైతులు బోరు బావుల వద్ద పగలనక రాత్రనక పడిగాపులు కాస్తున్నారని తెలిపారు.వేలాపాలా లేని విద్యుత్ కోతలతో సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.24గంటల విద్యుత్‌ను నమ్ముకొని వేసంగిలో రైతాంగం విస్తృతంగా పంటలు సాగు చేశారని గుర్తు చేశారు.ప్రభుత్వ హామీలు అమలుకు నోచుకోవడం లేదని వి మర్శించారు.పంటలపై వేల రూపాయల పెట్టుబడులు పెట్టి దివాలా తీసే పరిస్థితి దాపురించిందన్నారు.పొలాలు పొట్ట దశలో ఉన్న దశలో కోత లు విధించటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.ప్రస్తుతం పొట్టదశలో ఉన్న పొలాలకు మరింత నీరు అవసరమని చెప్పారు.ఈ క్రమంలో ఆటోమెటిక్ స్టాటర్లను తొలగిస్తామని హెచ్చరించడం సరికాదన్నారు.రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించి ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు,మేదరమెట్ల వెంకటేశ్వర్రావు, జిల్లా కమిటీ సభ్యులు దేవర వెంకటరెడ్డి, మండల కార్యదర్శి చందాచంద్రయ్య, బచ్చలకూర స్వరాజ్యం,ఎస్కె సైదా,విజయలక్ష్మీ, దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, బి ఉపేందర్, బి.నాగయ్య, ఎం.గోపయ్య, ఎస్.పిచ్చయ్య, గోగినేని వెంకట్‌రెడ్డి, అనంతు గురవయ్య, డి.జ్యోతి,వెంకటకోటమ్మ, బి.మంగయ్య, బి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు.