Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం
- రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లా అభివృద్ధిలో ఐక్యతతో కలిసి పనిచేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి ఎంపీ బడుగు లింగయ్యయాదవ్, కలెక్టర్ ఎస్.వెంకట్రావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి మంత్రి పాల్గొని మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కలలు అందరూ కంటారు..కానీ వాటిని కొందరే నిజం చేసుకోగలరన్నారు. కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం కలగని, 14 ఏండ్ల పాటు ఉద్యమించి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారన్నారు.ఆయన తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ అభివృద్ధి దేశానికి ఆదర్శంగా నిలుస్తుం దన్నారు.అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని అభినందించారు.సాధించి తెచ్చుకున్న తెలంగాణ అన్ని రంగాలలో అనతికాలంలోనే ఊహించని చారిత్రక మార్పులను సాధించిందని తెలిపారు.ఆయన సంకల్పం, చిత్తశుద్ది మూలంగానే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.నాడు తెలంగాణలో జరుగుతున్న అభివద్ధితో దేశం తెలంగాణ వైపు చూస్తుందన్నారు.ప్రజల ఆకాంక్షలకు పెద్ద పీట వేసే సీఎం కేసీఆర్‌కు ఈ సందర్బంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వృద్ధులకు బట్టలు, దుప్పట్లు, వికలాంగులకు ట్రై సైకిల్స్‌తో పాటు మూడు చక్రాల మోపెడ్లను పంపిణీ చేశారు.అనంతరం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులతో కలిసి మొక్కలు నాటారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్‌రావు,జెడ్పీ సీఈఓ సురేష్, డీఎఫ్ఓ సతీష్,డీఆర్డీఏ పీడీ కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ రామానుజులరెడ్డి, డీడబ్య్లూఓ జ్యోతిపద్మ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బి.శిరీష, కలెక్టర్ ఏఓ వి.శ్రీదేవి,డీఎస్పీ నాగ భూషణం,డీపీఓ జానయ్య, జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.