Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు వేదికల ద్వారా పంట సాగుపై అవగాహన కల్పించాలి
- కలెక్టర్ వెంకట్రావు
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో ఆయిల్ఫామ్ పంట సాగుపై ఉద్యాన, వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో ఆయిల్ఫామ్, వరి పంట సాగుపై సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నీటివనరులు గణనీయంగా పెరిగినందున ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో అధికారులు ఆయిల్ఫామ్ పంట సాగు మరింత పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలని ఆదేశించారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయిల్ ఫామ్ తోటల విస్తరణలక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.అలాగే ఉద్యాన, వ్యవసాయ అధికారులు నిరంతరం రైతులకు అందుబాటులో ఉండి రైతు వేదికల ద్వారా రైతులతో ఆయిల్ఫామ్ పంట సాగుపై క్లస్టర్ల వారీగా అవగాహన సమావేశాలు ఏర్పాటు చేసి పంటపై దృష్టి మళ్లించాలని సూచించారు.జిల్లాలో క్లస్టర్ల వారీగా ఉద్యాన, వ్యవసాయ పంట సాగు వివరాలను అందచేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో 2500ఎకరాల విస్తీర్ణంలో పంటసాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 1452 ఎకరాలలో ఆయిల్ఫామ్ పంట సాగులో ఉందన్నారు.మిగతా 1048 ఎకరాలలో రైతులను గుర్తించి పంట సాగు కల్పించి లక్ష్యాన్ని పెంచుతామన్నారు.2023-24 సంవత్సవరంలో 10 వేల ఎకరాల లక్ష్యానికి అనుకూలంగా ప్రణాళికలు సిద్ధం చేసి రైతు వేదికల ద్వారా రైతులకు ఆయిల్ఫామ్ పంటల సాగు , ప్రభుత్వ సబ్సిడీపై అవగాహన కల్పించాలని సూచి ంచారు.ఈ కార్యక్రమంలో డీఏఓ రామారావునాయక్, డీహెచ్ఓ శ్రీధర్‌గౌడ్, వ్యవసాయ అధికారులు సంధ్యారాణి, వాసు, జగ్గునాయక్, ఉద్యాన అధికారులు కె.జగన్, అనిత, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.